ఆంధ్ర బౌలర్లను చితక్కొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‪లో ఆల్‌టైం రికార్డ్

ఆంధ్ర బౌలర్లను చితక్కొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‪లో ఆల్‌టైం రికార్డ్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల పారించారు పంజాబ్ బ్యాటర్లు. టీ 20 ఫార్మాట్ లో సాగే ఈ ట్రోఫీలో  ఆంధ్ర బౌలర్లను ఒక ఆటాడేసుకున్నారు. మొదట బ్యాటింగ్  చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అల్మొప్రీత్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 87 పరుగులు చేసి తూఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 

వీరిద్దరి ధాటికి పంజాబ్ దేశవాళీ క్రికెట్ లో ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటివరకు భారత క్రికెట్ లో అత్యధిక స్కోర్ 263 పరుగులు గా ఉంది. 2013 లో జరిగిన ఐపీఎల్ లో పూణే వారియర్స్ మీద రాయల్ చాలెంజర్స్ ఈ స్కోర్ నమోదు చేసింది. తాజాగా 10 ఏళ్ళ రికార్డ్ ఈ రోజు పంజాబ్ ధాటికి బ్రేక్ అయింది. ఓవరాల్ గా టీ 20 క్రికెట్ లో ఇది నాలుగో అత్యధిక స్కోర్. ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ జట్టు మంగోలియా మీద 314 పరుగులు చేసి ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది. 
           
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట 276పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు 13ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి ఓటమివైపుగా పయనిస్తోంది. రికే భయి హాఫ్ సెంచరీతో పోరాడుతున్నాడు. మొత్తానికి పంజాబ్ ఆల్ రౌండర్ షో తో ఆంధ్రాకు తొలి మ్యాచులోనే కోలుకోలేని షాక్ ఇచ్చింది.