వీడియో: పంజాబ్ సీఎం భాంగ్రా డ్యాన్స్

 వీడియో: పంజాబ్ సీఎం భాంగ్రా డ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్..
  • కొద్దిరోజులు ఎంజాయ్ చేయనివ్వండి అంటూ నెటిజనుల సెటైర్లు

చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ భాంగ్రా డ్యాన్సు చేసి అదరగొట్టారు. పలువురు జానపద నృత్య కళాకారులతో కలసి స్టేజి ఎక్కి వారితో కలసి ఆడిపాడి.. మైమరపించారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజనులు రీట్వీట్ చేస్తూ.. పోనీలే కొద్ది రోజులు ఎంజాయ్ చేయనివ్వమంటూ ఛలోక్తులు విసురుతుండడంతో అవి కూడా వైరల్ అవుతున్నాయి. 
కుపుర్తాలో జరిగిన ఐకె గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి బయటి కార్యక్రమం. ఈవెంట్ లో భాగంగా జానపద నృత్య కళాకారులు భాంగ్రా డ్యాన్స్ చేస్తుంటే సీఎం స్పందించారు. పలువురు ఆహ్వానించడంతో ముఖ్యమంత్రి వేదిక కింద నుంచి స్టేజీపైకి వెళ్లి కళాకారులతో కలసి స్టెప్పులేశారు. 58 ఏళ్ల సీఎం  కళాకారులతో కలసి హుషారుగా స్టెప్పులేయడంతో కార్యక్రమం కలర్ ఫుల్ గా సాగి జోష్ నింపింది. దీంతో ఈ వీడియోను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.. మీరు కూడా చేసేయండి..