
- విశాక ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ జోగినిపల్లి పృథ్వీధర్ రావు
చందుర్తి, వెలుగు: శుద్ధ జలంతో ఆరోగ్యంగా ఉండవచ్చని విశాక ఇండస్ట్రీస్ బోర్డ్ డైరెక్టర్ జోగినిపల్లి పృథ్వీధర్రావు తెలిపారు. ఆయన తన సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు, తన తల్లి జోగినిపల్లి సుచరితమ్మ జ్ఞాపకార్థం రూ.13 లక్షలతో బిల్డింగ్, వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్లాంట్ను ప్రారంభించారు.
సొంత ఊరిపై మమకారంతో సేవ చేస్తున్నానని తెలిపారు. గ్రామస్తులు వాటర్ ప్లాంట్ ను ఉపయోగించుకోవాలని కోరారు. భవిషత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. చిలుక అంజిబాబు, పుల్కం రవి, పుల్కం మోహన్ పాల్గొన్నారు.