డబుల్ ఇస్మార్ట్ అప్డేట్ వచ్చేసిందోచ్

డబుల్ ఇస్మార్ట్ అప్డేట్ వచ్చేసిందోచ్

రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అప్డేట్ ఇచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ తో పాటు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.

ఈ ఒక్క సినిమాతో ఇటు రామ్, అటు పూరి ఇద్దరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. దీంతో.. ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మే 15 రామ్ పోతినేని పుట్టిన రోజున కావడంతో, ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు పూరి. ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీని తెలుగుకి మాత్రమే పరిమితం చేయలేదు పూరి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజుకి తీసుకెళ్ళాడు. రామ్ పోతినేని-బోయపాటి మూవీ షూటింగ్ ఫినిష్ అవగానే డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.మరి పూరి-రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టీరియా రిపీట్ చేస్తారేమో చూడాలి.