పుష్ప 2 రీషూట్స్.. అదుపుతప్పుతున్న బడ్జెట్ లెక్కలు.. ఇలా అయితే కష్టమే!

పుష్ప 2 రీషూట్స్.. అదుపుతప్పుతున్న బడ్జెట్ లెక్కలు.. ఇలా అయితే కష్టమే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించిన నేపధ్యంలో.. పుష్ప 2పై క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప పార్ట్ 2 ఇంట్రో వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునున్నాడు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు.

దాంతో పుష్ప 2 బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయి. దాంతో మరోసారి క్వాలిటీ చెక్ చేసుకున్న సుకుమార్.. రీ షూట్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా సినిమాలోని మేజర్ పార్ట్. దీంతో.. పుష్ప 2 బడ్జెట్ లెక్కలు తడిసి మోపెడవుతున్నాయని సమాచారం. ముందు ఈ సినిమా కోసం దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ అనుకుంటారా మేకర్స్. కానీ, షూట్ ఆలస్యంగా మొదలవడం, రీ షూట్స్ కారణంగా ఆ బడ్జెట్ కాస్త డబుల అయ్యిందట. ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే పుష్ప పార్ట్ 2 బడ్జెట్ రూ.450 నుండి రూ.500 కోట్ల వరకు అయివుంటుందని అంచనా.

నిజానికి పుష్ప పార్ట్ 1 మిక్సుడ్ టాక్ తో రూ.350 కోట్లు వసూళ్లు చేసింది. అందులో బాలీవుడ్ నుండి వచ్చినవే ఎక్కువ ఉండటం విశేషం. ఈ లెక్కన చూసుకుంటే పార్ట్ 2 పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి పార్ట్ 2 బడ్జెట్ రూ.500 కోట్లు అయినప్పటికి ఈజీగా గెటాన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఒకే కానీ, ఏమైనా తేడా జరిగితే మాత్రం పుష్ప 2 ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం ఖాయం. మరి ఏ ధైర్యంతో సుకుమార్ ఈ డెసిషన్ తీసుకున్నాడో తెలియాలంటే ఆగస్టు 15వరకు ఆగాల్సిందే.