నాజల్ వ్యాక్సిన్  తీసుకున్న పుతిన్‌

V6 Velugu Posted on Nov 25, 2021

ప్రయోగ పరీక్షల్లో భాగంగా ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్‌ 'స్ఫుత్నిక్‌ వీ'ని  తీసుకున్నట్లు  తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఈ టీకా వేసుకున్న తర్వాత తనకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని  చెప్పారు. ఈ నాసికా టీకా ప్రయోగ పరీక్షల (క్లినికల్‌ ట్రయల్స్‌)కు సంబంధించి 500 మంది వాలంటీర్లకు వేసేందుకు గాను గత నెలలో రష్యా వైద్య, ఆరోగ్య శాఖ అనుమతించింది. అయితే ఆ ప్రక్రియ ప్రారంభమైన విషయంపై మాత్రం స్పష్టత లేదు. గతంలో రష్యా స్వదేశీ టీకా 'స్ఫుత్నిక్‌ వీ'ని కూడా పుతిన్‌ తీసుకున్నారు. అలాగే తాను స్ఫుత్నిక్‌ లైట్‌ బూస్టర్‌ డోసు కూడా వేసుకున్నట్లు గత ఆదివారం తెలిపారు పుతిన్‌.

Tagged nasal vaccine, putin, taking experimental, feeling fine

Latest Videos

Subscribe Now

More News