సన్నిహితుడికి బాధ్యతలు అప్పగించనున్న పుతిన్..!

సన్నిహితుడికి బాధ్యతలు అప్పగించనున్న పుతిన్..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ను అనారోగ్యం వెంటాడుతోంది. కేన్సర్, పార్కిన్సన్స్‌‌తో బాధపడుతున్న ఆయనకు సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఆయనకు ఆపరేషన్ జరిగే అవకాశముందని న్యూయార్క్ పోస్ట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా మే 9న సర్జరీ చేయించుకోవాలని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం. కేన్సర్కు తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలని పుతిన్కు డాక్టర్లు సూచించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. కేన్సర్, పార్కన్సన్స్, స్కిజోఫినియా ట్రీట్మెంట్ కు హెవీ డోన్ మందులు తీసుకోవడంతో పుతిన్ బాగా బలహీనపడ్డారన్న వార్తలు వస్తున్నాయి. వెంటనే సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాను కోలుకునే వరకు బాధ్యతలను ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ మాజీ చీఫ్ నికోలాయ్ పత్రుషేవ్కు అప్పగించాలని పుతిన్ నిర్ణయించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. యుద్ధ వ్యూహాలను పకడ్బందీగా రచిస్తారని పత్రుషేవ్కు పేరుంది. 

రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అనారోగ్యానికి గురైతే ప్రధాని తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాలి. కానీ పీఎం మిఖైల్ మిషుస్తిన్ను కాదని.. పత్రుషేవ్కి పగ్గాలు అప్పగించాలని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఉక్రెయిన్తో యుద్ధం కీలక దశకు చేరినందున దూకుడుగా వ్యవహరించే వారికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయన పత్రుషేవ్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం నికోలాయ్ పత్రుషేవ్ తో పుతిన్ రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం..

కేఏ పాల్ హౌస్ అరెస్ట్

లంకుకు సాయం చేసేందుకు కేంద్రం అనుమతి