భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. తొలిసారి సింగపూర్ ఓపెన్ 2022 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇవాళ(ఆదివారం) జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్ లో చైనా ప్లేయర్ వాంగ్ జి యిని 21,9, 11,21, 21,15 తేడాతో ఓడించింది. 58 నిమిషాల పాటు సాగిన ఈ తుది పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది. 2022 లో మొదటి సారి పీవీ సింధు సూపర్ 500 టైటిల్ గెలిచింది. కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌లలో గెలిచిన తర్వాత 2022లో సింధుకు ఇది మూడో టైటిల్. శనివారం జరిగిన సెమీస్లో జపాన్ ప్లేయర్ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్లో జపాన్ క్రీడాకారిణి సయీనా కవాకమినిని 21,15, 21-7 స్కోరు తేడాతో మట్టికరిపించింది.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China's Wang Zhi Yi
— ANI (@ANI) July 17, 2022
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
