
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేసేలా హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను త్వరలోన మార్కెట్లోకి తీసుకురానుంది. అసలే పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుండగా ఈ బైక్ ప్రయాణం చాలా తక్కువ. హైదరాబాద్ కు చెందిన గ్రావ్ టన్ మోటార్స్ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్ ల విభాగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి బైక్ అని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.99,000. ఒక సారి ఛార్జీ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రూ.80కు 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని.. అంటే కిలోమీటరుకు అయ్యే వ్యయం 10 పైసలు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 5,000 బైక్ లను విక్రయించాలని గ్రావ్ టన్ టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపిన కంపెనీ.. అక్టోబరు నుంచి ఈ బైక్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది.