బెంగళూరు ఎయిర్పోర్టుపై మాధవన్ ట్వీట్.. ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

బెంగళూరు ఎయిర్పోర్టుపై మాధవన్ ట్వీట్.. ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

నటుడు, రైటర్, డైరెక్టర్ ఆర్.మాధవన్ ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (KIA) కొత్తగా తెరిచిన టెర్మినల్‌లోని మౌలిక సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ కలిగిందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇది విమానాశ్రయం అంటే ఎవరు నమ్మలేరని, భారతదేశంలో మౌలిక సదుపాయాలు చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వేలాడుతున్న మొక్కలు అన్నీ నిజమైన మొక్కలు అని, పైన ఇంకా నిర్మాణాలు చేశారని చెప్పారు. ఎయిర్ పోర్టులో అన్నీ అద్భుతంగా ఉన్నాయంటూ వీడియోలో చూపించారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by R. Madhavan (@actormaddy)

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యుత్తమమైనది. మౌలిక సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి.. చాలా గర్వంగా ఉంది అనే శీర్షికతో మాధవన్ పోస్ట్ చేశారు. మాధవన్ పోస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. భారతదేశ వృద్ధికి నెక్స్ట్ జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. విదేశీ విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాలు చాలా మెరుగ్గా ఉన్నాయంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.