కింగ్ 100 కన్‌‌‌‌ఫర్మ్‌‌‌‌.. తమిళ దర్శకుడితో సినిమా.. టైటిల్‌ ‘కింగ్‌‌‌‌ 100 నాటౌట్‌‌‌‌’ ?‌

కింగ్ 100 కన్‌‌‌‌ఫర్మ్‌‌‌‌.. తమిళ దర్శకుడితో సినిమా.. టైటిల్‌ ‘కింగ్‌‌‌‌ 100 నాటౌట్‌‌‌‌’ ?‌

‘శివ’ టైమ్ నుంచే కొత్తదనానికి ప్రాధాన్యతను ఇచ్చే నాగార్జున.. ఇటీవల విలన్‌‌‌‌గానూ ఎంట్రీ ఇచ్చారు. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రంలో సైమన్‌‌‌‌ అనే విలన్‌‌‌‌ పాత్రలో నాగార్జున కనిపించారు.  ఇదిలా  ఉంటే ఆయన మరో తమిళ దర్శకుడితో వర్క్ చేయబోతున్నారు. అదికూడా తన ల్యాండ్‌‌‌‌ మార్క్ మూవీకి కావడం విశేషం. త్వరలో తన 100వ సినిమా చేయబోతున్న నాగార్జున.. ఆ వివరాలను స్వయంగా వెల్లడించారు. జగపతిబాబు హోస్ట్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్‌‌‌‌ షోకి అతిథిగా హాజరైన నాగార్జున.. తన కెరీర్‌‌‌‌‌‌‌‌ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే తన 100వ సినిమాపై అప్‌‌‌‌డేట్ ఇచ్చారు.

ఏడాది క్రితమే తమిళ దర్శకుడు రా.కార్తీక్‌‌‌‌ తనకు ఓ స్టోరీ వినిపించాడని, గత ఆరేడు నెలలుగా దీనిపై వర్క్ జరుగుతోందని నాగ్ చెప్పారు. ఎంతో గ్రాండ్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో ఈ సినిమా ఉండబోతోందని, తన నెక్స్ట్ సినిమా అదేనని ఆయన చెప్పారు. గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి ‘కింగ్‌‌‌‌ 100 నాటౌట్‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌ వినిపించింది. తాజాగా నాగార్జున మాటలను బట్టి కాస్త అటు ఇటుగా ఇదే టైటిల్‌‌‌‌తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 29న నాగార్జున బర్త్‌‌‌‌ డే కానుకగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం.