యూకే ప్రధాని పీఠం కోసం రసవత్తర పోటీ

యూకే ప్రధాని పీఠం కోసం రసవత్తర పోటీ

న్యూఢిల్లీ : బ్రిటిష్​ ప్రధాని పదవి కోసం భారత సంతతి లీడర్, కన్వర్జేటివ్​ పార్టీ నాయకుడు​ రిషి శునక్​, విదేశాంగ సెక్రటరీ లిజ్​ట్రుస్​మధ్య రసవత్తర పోటీ నడుస్తోంది. బుధవారం జరిగిన ఫైనల్​ రౌండ్​ఓటింగ్​లో రిషికి పార్టీ సహచరులు గంపగుత్తగా ఓటు వేశారు. ఇప్పటి వరకు ఆయనకు మొత్తం 137 ఓట్లు పోలయ్యాయి. అయితే సహచరుడు లిజ్​ట్రుస్​నుంచి రిషికి తీవ్ర పోటీ ఎదురవుతోంది. లిజ్​కు ఇప్పటి వరకు మొత్తం 113 ఓట్లు వచ్చాయి. బుధవారం జరిగిన ఐదో రౌండ్​ ఓటింగ్​లో రిషి, లిజ్​, పెన్నీ మోర్డాంట్​పోటీపడ్డారు. ఈ ముగ్గురిలో రిషి టాప్​లో నిలిచారు. పెన్నీకి 105 ఓట్లు వచ్చాయి. దీంతో రేసు నుంచి ఆయన ఎలిమినేట్​ అయ్యారు. ఇక 1,80,000 మంది కన్జర్వేటివ్​పార్టీ సభ్యుల ఓట్ల కోసం దేశవ్యాప్తంగా రిషి, లిజ్​ ప్రచారం చేపట్టనున్నారు.