వినాయక చవితి ఏర్పాట్లను పక్కాగా చెయ్యాలి : సుధీర్ బాబు

వినాయక చవితి ఏర్పాట్లను పక్కాగా చెయ్యాలి : సుధీర్ బాబు
  • రాచకొండ సీపీ సుధీర్ బాబు
  • గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

ఎల్బీనగర్, వెలుగు: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, నీటి పారుదల, వైద్య, విద్యుత్, రవాణా శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, సీసీటీవీలు, విజిబుల్ పోలీసింగ్, డయల్-100కు సత్వర స్పందనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 

నిమజ్జన సమయంలో చెరువుల వద్ద లైటింగ్, క్రేన్లు, బారికేడ్లు, మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్లు, వైద్య సదుపాయాలు, 24 గంటల విద్యుత్ సరఫరా, రోడ్డు మరమ్మతులు, శానిటైజేషన్ చేపట్టాలని సూచించారు. రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెట్టాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.