హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో శనివారం కోకాపేటలో నిర్వహించిన శ్రీరాధా గోవింద రథయాత్ర వైభవంగా సాగింది. స్టోక కృష్ణ మహారాజ్ ప్రభూజీ, సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దారి పొడవునా ప్రసాదం పంపిణీ చేశారు. గండిపేట శ్రీకృష్ణ గోసేవ మండలి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టు వద్ద ముగిసింది. - వెలుగు, గండిపేట
