రాధేశ్యామ్ ఎప్పటికీ ముగియని కథ

రాధేశ్యామ్ ఎప్పటికీ ముగియని కథ

నాలుగేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్‌‌‌‌ని ఊరిస్తున్న ‘రాధేశ్యామ్’ ఎట్టకేలకి జనవరి 14న రిలీజవుతోంది. మనకి, మన నమ్మకానికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ అని టీమ్ చెబుతోంది. నిన్న జరిగిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో ఈ మూవీకి సంబంధించిన విశేషాలను టీమ్ సభ్యులు షేర్ చేసుకున్నారు. అందరూ ఎంజాయ్ చేసేలా మ్యూజిక్ ఉంటుందన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్. ప్రభాస్‌‌‌‌ని చాలా కొత్తగా ప్రెజెంట్ చేశానని చెప్పాడు సినిమాటోగ్రాఫర్  మనోజ్ పరమహంస. ‘పీరియాడికల్ మూవీ కావడంతో లొకేషన్స్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాంటి ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ అయినా ఇచ్చారు తప్ప బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు నిర్మాతలు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌‌‌‌తో తీయడానికి సపోర్ట్ చేశారు. కొవిడ్ టైమ్‌‌‌‌లోనూ ఇటలీలో నలభై ఐదు రోజులు షూట్ చేశాం’ అని చెప్పాడాయన. ఇక ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ మాట్లాడుతూ ‘బ్యూటిఫుల్ లవ్‌‌‌‌స్టోరీ ఇది.

1970లో ఇటలీ బ్యాక్‌‌‌‌డ్రాప్ స్టోరీ కావడంతో బిగ్‌‌‌‌ టాస్క్‌‌‌‌లా ఫీలయ్యాం. ఈ జర్నీలో ఒక విజన్‌‌‌‌తో పాటు బ్రహ్మాండమైన ఎమోషన్‌‌‌‌ కూడా ఉంది. అన్నీ కరెక్ట్‌‌‌‌గా కుదిరితేనే పీరియాడికల్ ఫిల్మ్స్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌గా వస్తాయి. ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయి’ అన్నాడు. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ ‘నెక్స్ట్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ కూడా గుర్తుంచుకునే  వండరఫుల్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేశారు నిర్మాత కృష్ణంరాజు. ఎప్పటికీ మర్చిపోలేని మూవీ. ట్రైలర్ చూసిన వాళ్లంతా విజువల్స్ చాలా బాగున్నాయంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం పన్నెండు దేశాల్లో వీఎఫ్ఎక్స్‌‌‌‌ వర్క్‌‌‌‌ జరుగుతోంది. ఇదొక ఇన్‌‌‌‌స్పిరేషనల్ ఫిల్మ్. ఈ స్టోరీ జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు. ఎప్పుడూ జరుగుతూ ఉండేది. మనకి, మన నమ్మకానికి  మధ్య జరిగే యుద్ధమే ఈ కథ. ఈ సినిమా మొదలుపెట్టడానికి కారణమైన  నా గురువు చంద్రశేఖర్ యేలేటికి థ్యాంక్స్. చేయడానికి ఒప్పుకున్న ప్రభాస్‌‌‌‌కి కూడా థ్యాంక్స్. ఐదు భాషల్లో రిలీజ్ చేయడానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు చేసిన సపోర్ట్ సామాన్యమైనది కాదు. ఆయనకీ థ్యాంక్స్. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాను. తమిళనాడు, మహారాష్ట్రల్లోని జ్యోతిష్యుల్ని కూడా కలిశాను. ఈ సినిమా 2022లో రిలీజవుతుందని అప్పుడే ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. చివరికి అదే నిజమైంది” అన్నాడు.