
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేష్ చంద్రశేఖర్ చాట్ పై ఈడీ అధికారులను బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు కలిశారు. సుఖేష్ చాట్ ఆధారంగా రఘనందన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. 6060 రెంజ్ రోవర్ కార్ నెంబర్ ఎవరిదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ పై బీఆర్ ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని రఘనందన్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యలయాన్నే మనీలాండరింగ్ సెంటర్ గా చేశారని ఆయన ఆరోపించారు. సుఖేష్ చంద్రశేఖర్ ను మళ్లీ ఆదుపులోకి తీసుకుని విచారించాలని రఘనందన్ డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఆరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు.
ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాటింగ్ వివరాలు అంటూ 20 పేజీల లేఖను.. తన లాయర్ ద్వారా విడుదల చేశారు సుఖేష్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తన లేఖలో స్పష్టం చేశాడు సుఖేష్. ఎమ్మెల్సీ కవిత పేరును.. తన ఫోన్ నెంబర్ లో కవిత అక్క టీఆర్ఎస్ పేరుతో సేవ్ చేసుకున్నాడు. కవితతో చాటింగ్ చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను వెల్లడించాడు సుఖేష్. అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్ చేయటం విశేషం.