- ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం
న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో సంచల నంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీల క పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు రాఘవ రెడ్డిని అప్రూవర్‌గా మారేం దుకు తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారి క్షమాపణ పొందేందుకు కోర్టు అనుమతి కోరుతూ 306 సీఆర్‌పీసీ కింద రాఘవ్ సీబీఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు.
ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్... రాఘవ్ అప్రూవర్ గా మారేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. తాజాగా రాఘవ్ బెయిల్ పిటిషన్ స్పెషల్ కోర్టు ముందుకు రాగా సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే లిక్కర్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో రాఘవను నిందితుడిగా కానీ, అతనికి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ సంస్థను ప్రస్తావించలేదు. అంతేకాకుండా రాఘవ్ దర్యాప్తులో సహకరించారని, తమ సమన్లకు విధిగా హాజరయ్యారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 161, 164 (2) కింద నమోదు చేసిన వాంగ్మూలాలలో కీలకమైన వాస్తవాలను వెల్లడించాడని పేర్కొంది.
