
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో రాఘవ లారెన్స్. తను హీరోగా నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతోంది. అతను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి మాత్రం చాలా కాలమైంది. అయితే త్వరలోనే లారెన్స్ ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు. శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమా తెరకెక్కించిన బి. కిషోర్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు.
ఇప్పటికే లారెన్స్‌ను కలిసి కథ వినిపించాడట కిషోర్. స్టోరీ లైన్‌తో పాటు తన క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండడంతో లారెన్స్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించబోతున్నారు. ఈ ఏడాదే సెట్స్‌కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో లారెన్స్ బిజీగా ఉన్నాడు.