
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఎలాంటి అలుపూ లేకుండా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలను మరింత ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. మార్గమధ్యంలో ప్రజలతో మమేకమవుతూ, పిల్లలతో ఆటలాడుతూ, పలకరిస్తూ నడక సాగిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ పోతురాజు తరహాలో కొరడాతో కొట్టుకున్నారు. ఇది చూసేందుకు అక్కడి ప్రజలు తరలివచ్చారు.
నిన్నటి వరకూ హైదరాబాద్ లో సాగిన భారత్ జోడో యాత్ర.. సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పట్టణ శివారులో పాదయాత్రకు కాసేపు విరామం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్టు సమాచారం.