కరోనాను కంట్రోల్ చేయడంలో భారత్ కంటే పాకిస్తాన్ బెటర్

కరోనాను కంట్రోల్ చేయడంలో భారత్ కంటే పాకిస్తాన్ బెటర్

కరోనావైరస్‌ను భారత్ కంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం కరోనావైరస్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 10.3 శాతానికి కుదించే అవకాశముందని ఆయన అన్నారు. ఐఎంఎఫ్ ప్రకారం.. చైనా, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌ల కంటే భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతానికి కుదించబడుతుందని ఆయన అన్నారు.

‘బీజేపీ ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం ఇది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లు కూడా కోవిడ్‌ను అరికట్టడంలో భారతదేశం కంటే మెరుగ్గా ఉన్నాయి’అని ఆయన ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 10.3 శాతానికి కుదించబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం ఒక నివేదికలో తెలిపింది. ఏదేమైనా 2021లో భారతదేశం 8.8 శాతం వృద్ధి రేటుతో తిరిగి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల చైనా వృద్ధి రేటు 8.2 శాతాన్ని దాటేస్తుందని ఐఎంఎఫ్ ‘వరల్డ్ ఎకానమిక్ అవుట్‌లుక్’ లో తెలిపింది.

For More News..

కరోనాతో బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మృతి

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

రాష్ట్రంలో మరో 1,554 కరోనా కేసులు