మోదీ సర్కారు ధనికులనే ధనికులుగా చేస్తోంది : రాహుల్

మోదీ సర్కారు ధనికులనే ధనికులుగా చేస్తోంది : రాహుల్
  • మార్కెట్​ మ్యానిపులేషన్​పై సైలెంట్​గా ఉంటున్నది
  • సాధారణ ఇన్వెస్టర్లు సర్వం కోల్పోతున్నారని ఆవేదన 

న్యూఢిల్లీ: స్టాక్​ మార్కెట్​ మ్యానిపులేషన్​పై మోదీ సర్కారు మౌనంగా ఉండడంతో ధనికులే ధనికులు అవుతున్నారని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ అన్నారు. సాధారణ వినియోగదారులు సర్వం కోల్పోయి ఆర్థికంగా పతనావస్థకు చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్టాక్ మార్కెట్​లో జేన్ స్ట్రీట్ స్కామ్‌‌పై సోమవారం రాహుల్ ​గాంధీ ఎక్స్​ వేదికగా స్పందించారు.  ఫ్యూచర్స్​అండ్​ ఆప్షన్స్(ఎఫ్​అండ్​ఓ) లో లొసుగులను తాను ముందే ఊహించానని చెప్పారు. ‘‘ఎఫ్ అండ్​ఓ మార్కెట్ ‘పెద్ద కంపెనీలకు’ ప్లేగ్రౌండ్​గా మారిందని నేను 2024లోనే స్పష్టంగా చెప్పా. --  చిన్న పెట్టుబడిదారుల జేబులు నిరంతరం ఖాళీ అవుతాయని ఊహించా. జేన్ స్ట్రీట్(గ్రూప్) వేల కోట్లను తారుమారు చేసిందని ఇప్పుడు సెబీ స్వయంగా అంగీకరిస్తున్నది. 

సెబీ ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉండిపోయింది?”అని ప్రశ్నించారు.  ‘‘అనియంత్రిత ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఐదేండ్లలో 45 రెట్లు పెరిగింది. 90 శాతం చిన్న పెట్టుబడిదారులు మూడేండ్లలో రూ. 1.8 లక్షల కోట్లు కోల్పోయారు” అని 2024 సెప్టెంబర్ 24న చేసిన పోస్ట్​ను రాహుల్ ​గాంధీ ట్యాగ్ చేశారు. కాగా, ఎఫ్​ అండ్​ ఓ మ్యానిపులేషన్​ను మోదీ సర్కారు పట్టించుకోలేదని రాహుల్ ​గాంధీ మండిపడ్డారు. స్టాక్​ మార్కెట్​నే రిగ్గింగ్​ చేసే వ్యక్తులు ఇంతమంది ఉన్నారా? అని తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు.