తల్లి ఆత్మకథపై.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్ట్

తల్లి ఆత్మకథపై.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్ట్

తల్లి సోనియాగాంధీ ఆత్మకథపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్ట్ సోషల్  మీడియాలో  షేర్ చేశారు. మా అమ్మ ఆత్మకథ అద్భుతంగా  ఉంది.. మా ఆత్మకథ పుస్తకం బిలాంగింగ్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. అమ్మ ఆత్మకథ పుస్తకాన్ని చాలా మంది చదివారు.. చదువుతున్నారు.ప్రశంసిస్తున్నారు. అంధభక్తులు కూడా చదివారు.. కామెంట్స్ చేస్తున్నారు. వారికి  అభినందనలు అంటూ  ఆన్‌లైన్ లోవారి స్పందనకు వ్యంగ్యంగా రాశారు. ‘‘ అంధ భక్తులందరూ అమ్మ  ఆత్మకథ పుస్తకంపై కామెంట్స్ చేస్తూనే ఉండండి. మీరు ఎంత ఎక్కువగా కామెంట్స్ చేస్తే ఆ పుస్తకం అంత బాగా అమ్ముడవుతుంది" అని రాహుల్ సెటైర్లు వేశారు. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ ఇటీవల విడుదల చేసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ ' అనే ఆత్మకథపై విమర్శలు చేసిన వారిని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ విమర్శకులను ఆయన "అంధభక్తులు" అని అభిర్ణించారు. 

2026 నవంబర్ 10న సోనియా గాంధీ 544 పేజీల ఆత్మకథ విడుదల చేశారు. ఆమె  ఆత్మకథ ఆన్‌లైన్‌లో తీవ్రమైన చర్చకు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలకు దారితీయగా, మద్దతుదారుల నుంచి ప్రశంసలు అందుకుంది. హార్పర్‌కాలిన్స్ ఇండియా, ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ ప్రచురించిన   బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్  అనే ఈ పుస్తకం, సోనియా గాంధీ ఇటలీలోని బాల్యం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఆమె వివాహం, భారత రాజకీయాల్లోకి ఆమె ప్రవేశం, కీలక రాజకీయ సంఘటనలపై ఆమె అభిప్రాయాలను వివరిస్తుంది.