దేశంలో నిరుద్యోగ సమస్య పెరిపోతోంది

దేశంలో నిరుద్యోగ సమస్య పెరిపోతోంది

విద్యావంతులైన యువత తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. అంతేకాదు..దేశంలోని పలు ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల అంశాన్ని ఆయన ట్విటర్‌లో ప్రస్తావించారు.

పరిస్థితులు చూస్తుంటే దేశంలో ఉన్నత చదవులు అభ్యసించినందుకు ప్రభుత్వం వారిని శిక్షిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు రాహుల్. ప్రత్యేకంగా OBC,SC,ST విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. దేశంలోని పలు ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న లెక్షరర్ పోస్టులకు సంబంధించిన డేటాను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. IIT,NIT,IIM సహా పలు  టెక్నికల్ వర్శిటీల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు రాహుల్.