రైలు బోగీ రెస్టారెంటయింది

రైలు బోగీ రెస్టారెంటయింది

ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వే శాఖ కొత్త ప్లాన్స్‌‌తో  ముందుకెళ్తోంది. ఇందుకు పాత రైల్వే కోచ్ లను వినియోగించుకుంటోంది. ఇప్పటికే ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) ఎంప్లాయీస్ కోసం వినియోగంలో లేని ఒక రైల్వే కోచ్ ను కెఫెటేరియాగా మార్చింది. పాట్నా (బిహార్)లోని దనపూర్ కోచింగ్ డిపో దగ్గర దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒకేసారి 40 మంది కూర్చునేలా తీర్చిదిద్దింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ ఈస్టర్న్ రైల్వే జోన్ రెండు రైల్వే కోచ్ లను రెస్టారెంట్ గా మార్చింది. పాత మెమూ రైళ్ల కోచ్ లను మాడిఫై చేసి ‘‘రెస్టారెంట్ ఆన్ వీల్స్” పేరుతో పశ్చిమ బెంగాల్‌‌‌‌ లోని అసాన్సోల్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది. ఇందులో ఒక కోచ్‌‌‌‌ను కెఫెటేరియాగా తీర్చిదిద్దగా, మరో కోచ్ ను 42 సీట్లతో రెస్టారెంట్‌‌‌‌గా అందంగా తీర్చిదిద్దారు. దీన్ని ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలూ వాడుకోవచ్చు. ఈ రెస్టారెంట్ ను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఇటీవల ప్రారంభించారు. చార్జీలతోనే కాకుండా వేరే పద్ధతుల్లోనూ ఆదాయం కోసం రెస్టారెంట్ ఏర్పాటు చేశామని, ఐదేళ్లలో 50 లక్షలు రావచ్చని ఈస్టర్న్ రైల్వే జోన్ అధికారి ఒకరు తెలిపారు.