ఈ ఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తయినది.. వచ్చే ఏడాదికే కాశ్మీర్‌ బ్రిడ్జి

ఈ ఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తయినది..  వచ్చే ఏడాదికే కాశ్మీర్‌ బ్రిడ్జి

    స్పీడుగా నిర్మాణం

     చలిని లెక్కచేయకుండా పని చేస్తున్న ఇంజనీర్లు, వర్కర్లు

ఉధంపూర్‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌ ఉద్ధంపూర్‌‌‌‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీని పనులు స్పీడు అందుకున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాతావరణం సరిగా లేకపోయినా లెక్క చేయకుండా ఇంజినీర్లు, వర్కర్లు పనులు కొనసాగిస్తున్నారు. 2021 కల్లా బ్రిడ్జి పూర్తి చేయాలనే టార్గెట్‌‌ను చేరుకునేందుకు కష్టపడుతున్నామని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ ఛైర్మన్‌‌, మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌    సంజయ్‌‌ గుప్తా చెప్పారు.  ఇప్పటికే బ్రిడ్జ్‌‌ ఆర్చ్‌‌ చాలా వరకు పూర్తయిందని, దాని ఎత్తు ఈఫిల్‌‌ టవర్‌‌‌‌ కంటే 35 మీటర్లు ఎత్తు ఉంటుందని అన్నారు. “ బ్రిడ్జిని, టన్నెళ్లను నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వాటిని అధిగమిస్తూ ఇంజినీర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తైతే అది ఇంజినీరింగ్‌‌ మిరాకిల్‌‌. కచ్చితంగా టార్గెట్ లోగా పూర్తి చేస్తాం” అని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ కోఆర్డినేషన్‌‌ చీఫ్‌‌ ఇంజినీర్‌‌‌‌ ఆర్‌‌‌‌కే. హెగ్దే అన్నారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌ను దేశంలో  ఇతర ప్రాంతాలతో కలిపేందుకు 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ బ్రిడ్జికి పునాది వేశారు.