జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెన పనులు శనివారం పూర్తైయ్యాయి. రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి. జూన్ 16( ఆదివారం) వంతెనపై రైల్వే అధికారులు పరీక్షించారు. ట్రైన్ ఇంజన్ ను టెస్ట్ చేయగా విజయవంతంగా అది రియాసి స్టేషన్ కు చేరుకుంది. ఇది పెద్ద రైల్వే ప్రాజెక్ట్. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది. ఈ రైల్వే బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు, మొత్తం పొడవు 1.3 కి.మీటర్లు.
#WATCH | Reasi, J&K: Train service from Ramban to Reasi via the world’s highest railway bridge built on river Chenab to begin soon. The Udhampur-Srinagar-Baramulla Rail Link (USBRL) project will be completed by year-end: Northern Railways
— ANI (@ANI) June 15, 2024
The USBRL project, including the 48.1… pic.twitter.com/HDzABM0yxU
2009 అక్టోబర్ లో USBRL ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభించారు. ఇది 118 కి.మీ పొడవైన ఖాజిగుండ్-బారాముల్లా సెక్షన్‌ను కవర్ చేస్తుంది.18 కి.మీ పొడవైన బనిహాల్-ఖాజిగుండ్ సెక్షన్ జూన్ 2013లో స్టార్ట్ చేశారు. 25 కి.మీ పొడవు గల ఉధంపూర్-కత్రా సెక్షన్ జూలై 2014లో ప్రారంభించబడింది. USBRL ప్రాజెక్ట్‌లో 48.1 కి.మీ పొడవున్న బనిహాల్-సంగల్దన్ విభాగం కూడా ఉంది. 2024 ఫిబ్రవరి 20న ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
#WATCH | J&K: Railway officials conducted an extensive inspection of the newly constructed world's highest railway bridge-Chenab Rail Bridge, built between Sangaldan in Ramban district and Reasi. Rail services on the line will start soon. pic.twitter.com/48ETYT1GpB
— ANI (@ANI) June 16, 2024