రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులు

రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులు

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డు) నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 8వ తేదీ వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

ఖాళీలు: మొత్తం 9000 పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,100, టెక్నీషియన్ గ్రేడ్-III: 7,900 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18- నుంచి 36 ఏళ్లు. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18- నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 బేసిక్​ జీతం చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్: ఫస్ట్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ సీబీటీ-1, సెకండ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ సీబీటీ-2, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 9 నుంచి ఏప్రిల్​ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి.