ఆరోగ్యం సరిగా లేని వారు శ్రామిక్‌ రైళ్లలో రావద్దు

ఆరోగ్యం సరిగా లేని వారు శ్రామిక్‌ రైళ్లలో రావద్దు
  • రైల్వే శాఖ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఆరోగ్యం సరిగా లేనివారు, గర్భిణీలు శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించవద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న శ్రామిక్‌ రైళ్లలో రెండు రోజుల వ్యవధిలో 9 మంది వలస కూలీలు చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్లంతా ముందుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని రైల్వే శాఖ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. బీపీ, క్యాన్సర్‌‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు శ్రామిక్‌ రైళలో జర్నీ చేయొద్దని అన్నారు. గర్భవతులు, 10 ఏళ్ల లోపు పిల్లలు అవసరమైతే తప్ప ప్రయాణించొద్దని సూచించారు. ప్యాసింజర్ల కోసం రైల్వే శాఖ 24 గంటలు పనిచేస్తోందని, అందరూ సహకరించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. హెల్ప్‌ చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని, ఈ మేరకు ఏదైనా అవసరమైతే 139 & 138 హెల్ప్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు.