CAA నిరసనల్లో రూ.88 కోట్ల రైల్వే ఆస్తులు ధ్వంసం

CAA నిరసనల్లో రూ.88 కోట్ల రైల్వే ఆస్తులు ధ్వంసం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు దారితప్పుతున్నాయి. CAAను రీకాల్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా చేపడుతున్న  ఆందోళనలు కొన్ని చోట్ల తీవ్ర హింసకు దారి తీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులపై నిరసనకారులు దాడికి దిగుతున్నారు. రైళ్లు, బస్సులకు నిప్పంటించి తగులబెడుతున్నారు.

పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిన నాటి నుంచి జరుగుతున్న నిరసనల్లో రైల్వే ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. దేశ వ్యాప్తంగా రైల్వేకు జరిగిన నష్టాన్ని ఆ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.88 కోట్ల మేర ఆస్తులు ధ్వంసం అయినట్లు తెలిపింది.

జోన్ల వారీగా జరిగిన నష్టం:

  • ఈస్ట్రన్ రైల్వే జోన్: రూ.72 కోట్లు
  • సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్: రూ.13 కోట్లు
  • నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ జోన్: రూ.3 కోట్లు