మెదక్​ జిల్లాలో మూడోరోజూ ముసురు!

మెదక్​ జిల్లాలో మూడోరోజూ ముసురు!

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుసగా మూడో రోజు ముసురు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంజీరా నదితోపాటు వాగులు, డ్యామ్​లు పొంగిపొర్లుతున్నాయి.  ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో ఉదయం అభిషేకాలు, అర్చనలు చేసి గర్బగుడిని మూసివేశారు. దుర్గమ్మ ఉత్సహ విగ్రహన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. పలు రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామ పటేల్ చెరువు వంతెన దాటుతుండగా  ఒక వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.

తెల్లాపూర్​ మున్సిపల్​ కేంద్రంలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడడంతో ఓ స్కూల్​ బస్సు అందులో దిగబడిపోయింది. దీంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. శివ్వంపేట మండలం అల్లిపూర్ గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పలుచోట్ల పంటచేళ్లలో నీళ్లు నిలిచాయి. పలుచోట్ల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. – వెలుగు, నెట్​వర్క్​