రైతులకు గుడ్ న్యూస్: సన్న వడ్లు క్వింటాలుకు రూ.3,450.. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి..12368 రకం సాగు

రైతులకు గుడ్ న్యూస్: సన్న వడ్లు క్వింటాలుకు రూ.3,450.. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి..12368 రకం సాగు

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజపురంలో వానాకాలం సాగు చేసిన సన్న వడ్లు క్వింటాలుకు రూ.3,450 ధర పలికింది. రాజపురం గ్రామానికి చెందిన పుచ్చకాయల గణపతిరెడ్డి 6 ఎకరాల్లో 12368 రకం సన్న వడ్లను సాగు చేశారు. 

ముందస్తుగా వరినాట్లు వేయడంతో పంట అక్టోబర్‌‌‌‌ తొలివారంలోనే కోతకు వచ్చింది. దీంతో మంగళవారం ఎకరం పంటను హార్వెస్టింగ్‌‌‌‌ చేశారు. ఎకరానికి సుమారు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొత్త ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులు పోటీ పడటంతో క్వింటాలుకు రూ.3,450 చొప్పున కొనుగోలు చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.2,461 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌‌‌‌ కలిపి మొత్తం రూ.2,961 చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే అదనంగా రూ.489 ధర లభించడంతో రైతు గణపతిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.