రాజ్ భవన్ పై నిఘా పెట్టారు: వెస్ట్ బెంగాల్ గవర్నర్ సంచలన ఆరోపణలు

రాజ్ భవన్ పై నిఘా పెట్టారు: వెస్ట్ బెంగాల్ గవర్నర్ సంచలన ఆరోపణలు

రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతోంది

కాన్ఫిడెన్షియల్డాక్యుమెంట్స్లీకవుతున్నయ్

రాజ్ భవన్నిఘా వెనుక ఎవరున్నా తప్పించుకోలేరని హెచ్చరిక

పశ్చిమ బెంగాల్ లో సీఎం మమత, గవర్నర్ జగదీప్ధన్ ఖర్ మధ్య పంచాయితీ నడుస్తూ నే ఉంది. సీఎం తనను అవమానించారని, ఎట్ హోం కార్యక్రమానికి రాలేదని గవర్నర్ ఆరోపించారు. ఎట్ హోం పోగ్రామ్ లో సీఎం మమత కూర్చోవాల్సిన సీట్ ఖాళీగా ఉండడంతో దానికే నమస్కరి స్తూ ఇలా ట్వీ ట్ చేశారు.

కోల్ కతా: రాజ్ భవన్ పై నిఘా పెట్టారని వెస్ట్‌ బెంగాల్‌ సర్కారుపై గవర్నర్‌ జగదీప్‌ ధన్ఖర్‌ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ఇలా చేస్తూ భవన్‌ గొప్పతనాన్ని తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రమంతా అన్యాయం, అక్రమం రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు. కాన్ఫిడెన్షియల్‌ డాక్యుమెంట్స్‌ కూడా లీకవుతున్నాయన్నారు. భవన్‌ నిఘాపై ఎంక్వైరీకి ఆదేశించానని, అది త్వరలోనే పూర్తవుతుందని, దీని వెనుక ఎవరున్నా చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. శనివారం రాజ్ భవన్ లో జరిగిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులు హాజరుకాకపోవడంతో నొచ్చుకున్న గవర్నర్‌.. సర్కారుపై రకరకాల కామెంట్స్‌ చేశారు. అవమానం కొత్తేం కాదు వెస్ట్‌ బెంగాల్‌ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక చాలాసార్లు తనకు అవమానం జరిగిందని జగదీప్‌ చెప్పారు. అసెంబ్లీ, ఓ యూనిర్సిటీని విజిట్‌ చేసినప్పుడు, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘గతంలో అసెంబ్లీకి వస్తానని ముందే నేను సమాచారం అందించా. కానీ వెళ్లేసరికి అసెంబ్లీని లాక్‌ చేశారు. ఓ యూనివర్సిటీ విజిట్‌ సందర్భంగా కూడా వైస్‌ చాన్సలర్‌ చాంబర్ కు లాకేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజు అసెంబ్లీలో ఆరో వ్యక్తిగా మాట్లాడాను’ అని చెప్పారు. ఇప్పుడు ఇండిపెండెన్స్‌ డే రోజు కూడా ఇలాగే అవమానిం చారని అన్నారు. పైగా జెండా ఎగరేసే రోజు కూడా రాజకీయ అల్లర్లు , హింస, హత్యలు జరిగాయని.. రాష్ట్రంలో అన్యాయం, అక్రమం రాజ్యమేలుతోందని అన్నారు. ప్రతిపక్ష నేతలను కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకునే అధికారం రాజ్యాంగం తనకిచ్చిందని, చెప్పాల్సిన బాద్యత సీఎంపై ఉందని గవర్నర్‌ గుర్తు చేశారు. బెంగాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ 5 సార్లు జరిగిందని, మరి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయని, ఎన్ని జాబులొచ్చాయని ప్రశ్నించానన్నారు. కానీ దీనిపై సర్కారు నుంచి ఎలాంటి రెస్పా న్స్‌ లేదన్నారు. పోలీసులు రాజకీయ నేతల కోసమే పనిచేస్తున్నట్టు అనిపిస్తోందని.. ప్రతిపక్ష ఎమ్మెల్యే లు, ఎంపీలపై క్రిమినల్‌ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం లో ప్రజాస్వామ్యం కాపాడేందుకు తన శాయశక్తులా పని చేస్తానని అన్నారు.

ఖాళీ కుర్చీ చాలా చెప్తది

ఎట్‌ హోమ్‌ కార్యక్రమంపై ముందుగానే సమాచారం ఇచ్చినా సీఎం, ప్రభుత్వ అధికారులు గైర్హజరు కావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. కార్యక్రమంలో సీఎం కూర్చోవాల్సిన కుర్చీకి తాను నమస్కరిస్తున్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ఖాళీ కుర్చీ చాలా చెప్తది’ అని ట్విట్టర్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. మనకు స్వేచ్ఛ, ప్రజాస్ వామ్యం కల్పించిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్ కున్న గొప్ప సంస్కృతి పలుచన చేస్తుందన్నారు. అయితే పొద్దున అధికారిక ఇండిపెండెన్స్‌ డే ఈవెంట్ లో పాల్గొన్నాక గవర్నర్ ను కలిసిన సీఎం కలిశారు. కరోనా టైమ్ లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి గవర్నర్‌ ఎక్కువ మందిని పిలవడం వల్లే సర్కారు నుంచి ఎవరూ హాజరు కాలేదని తెలిసింది. గవర్నర్‌ మాత్రం తాము 35 మంది వరకే పిలిచామని చెప్పారు.