బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌‌‌‌కు రాజాసింగ్ వార్నింగ్

బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌‌‌‌కు రాజాసింగ్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో టిప్పు సుల్తాన్, సలావుద్దీన్ ఒవైసీ విగ్రహాలు పెట్టాలని అక్కడి మున్సిపల్ కౌన్సిల్  తీర్మానం చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. వాళ్ల విగ్రహాలుపెడితే కూల్చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌‌‌‌కు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సిటీలో ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలే సలావుద్దీన్ విగ్రహం పెట్టలేదని, ఆ పార్టీ ఆఫీసు దారుస్సలాంలోనూ ఆయన విగ్రహం లేదన్నారు. 50 లక్షల మంది హిందువులను చంపిన టిప్పు సుల్తాన్​ను సైతాన్‌‌‌‌లా చూస్తామని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెడితే హిందువులు ఒప్పుకోరని చెప్పారు.