వైభవంగా మినీ కపుల్ వెడ్డింగ్

వైభవంగా మినీ కపుల్ వెడ్డింగ్

పెళ్లిళ్లు అనేది స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటుంటారు. కొన్ని జంటలను చూస్తే అది నిజమేననిపిస్తుంది. తాజాగా రాజస్థాన్‭కు చెందిన ఓ జంట వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరుగుజ్జులైన వధూవరులను చూసిన వారంతా ఈడు, జోడు బాగుందని అంటున్నారు. రాజస్థాన్ రాజ్ సమంద్ కు చెందిన రిషబ్ ఎత్తు 3 అడుగులు. అతనికి జోధ్ పూర్ కు చెందిన సాక్షి సోషల్ మీడియాలో పరిచయమైంది. అలా మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో గతేడాది నిశ్చితార్థం జరిగింది. 

ఈ ఏడాది జనవరి 26న జోధ్‭పూర్‭లో ఇరు కుటుంబాలు, మిత్రుల సమక్షంలో రిషబ్, సాక్షిల పెళ్లి ఘనంగా జరిగింది. సాక్షి, రిషబ్ జంట ఇన్‌స్టాగ్రాంలో ‘మినీ కపుల్‌’ అనే ఐడీని క్రియేట్‌ చేసి వారి పెళ్లి ఫొటోలు, వీడియో పోస్టు చేశారు. అవి చూసినవారంతా ఈ కొత్త జంట ఈడు జోడు బాగుందంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రిషబ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా.. సాక్షి ఎంబీఏ కంప్లీట్ చేసి. ప్రస్తుతం ఓ స్కూల్ లో టీచర్‭గా ఉద్యోగం చేస్తోంది.