రాజస్థాన్ ప్రభుత్వంస్టూడెంట్స్ కు శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ప్రభుత్వాలు ప్రత్యేక మార్గాల్లో లబ్ధి చేకూరేలా చేస్తోంది. రెండేళ్ల నుంచి 8,10, 12 తరగతుల్లో 75 శాతం కంటె ఎక్కువ శాతం మార్కులు పొందిన ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది మొత్తం 55 వేల 727 మంది విద్యార్థులు ట్యాబ్‌లు తీసుకోనున్నారు. అయితే ఈ ఏడాది ట్యాబ్‌లతో పాటు ఆన్ లైన్ క్లాసులు వినేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ట్యాబ్ లతో పాటు ఫ్రీగా 1జీబీ( రోజుకు) డేటా సిమ్ కార్డ్‌లను ఇవ్వనుంది. ఈ సిమ్ కార్డ్ ద్వారా పిల్లలకు మూడేళ్లపాటు ప్రతిరోజూ 1 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఇప్పటి వరకు ట్యాబ్ లు మాత్రమే ఇచ్చిన సర్కార్ కొత్తగా ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా కలుగజేస్తుందని విద్యాశాఖ ప్రకటించింది.
రాజస్థాన్ ప్రభుత్వం 18 కోట్ల రూపాయిలతో ఈ పథకాన్ని ప్రారంభించింది. జూన్ నెలాఖరులోగా ఈ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో (DUOLINGO) ఇన్ స్టాల్ చేస్తారు.. ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్లో కూడా పని చేసేలా ఏర్పాటు చేయబడింది.
ఉచిత ట్యాబ్‌లలో మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్. టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు ఉన్నాయి. ట్యాబ్ లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్.. 3 ఏళ్ల పాటు సంపూర్ణ వారంటీ.. ఏదైనా సమస్య తలెత్తితే స్కూల్ టీచర్లు. ఒక వారంలో రిపేర్ చేసైనా ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇస్తారు.. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.