లాటరీ పద్ధతిలో రాజీవ్‌‌‌‌ స్వగృహ ఇండ్ల కేటాయింపు

లాటరీ  పద్ధతిలో రాజీవ్‌‌‌‌ స్వగృహ ఇండ్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు:  పోచారంలోని రాజీవ్‌‌‌‌ స్వగృహ ఇండ్ల కోసం నిర్వహించిన లాటరీలో 1,404 మందికి ఫ్లాట్లు కేటాయించారు. మొత్తం 1,719 ఫ్లాట్లకు లాటరీ తీశామని అధికారులు చెప్పారు. వీటి కోసం 5,921 ఫస్ట్ ప్రిఫెరన్స్ అప్లికేషన్లు రాగా, 1,404 మందికి ఫ్లాట్లు అలాట్‌‌‌‌ చేశామని తెలిపారు. ఇందులో 440 వన్‌‌‌‌ బీహెచ్‌‌‌‌కే ఫ్లాట్లు, 822 టు బీహెచ్‌‌‌‌కే ఫ్లాట్లు, 52 ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు, 90 ట్రిపుల్ బెడ్రూం డీలక్స్‌‌‌‌ ఫ్లాట్లు ఉన్నాయి. ఐదు, ఆరో ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లోని 51 డబుల్ బెడ్రూం ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. సెకండ్ ప్రిఫరెన్స్‌‌‌‌ ఇచ్చుకున్న దరఖాస్తు దారులకు డ్రా పద్ధతిలో వీటిని కేటాయించనున్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని బీఆర్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సుమారు 14 గంటల పాటు లాటరీ కార్యక్రమం జరిగింది. లాటరీ పారదర్శకంగా ఉండేందుకు యూట్యూబ్, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో అధికారులు ప్రత్యక్ష ప్రసారం చేశారు. లాటరీ సీడీఎంఏ (కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) సత్యనారాయణ, మేడ్చల్ కలెక్టర్ హరీశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ హాజరై పరిశీలించారు. కాగా, మంగళ, బుధవారాల్లో బండ్లగూడ ఫ్లాట్ల లాటరీ తీయనున్నారు. 

రహస్యంగా డ్రా ప్లేస్ 

లాటరీకి సంబంధించి దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్‌‌‌‌ రూపంలో ముందుగానే సమాచారం ఇస్తామని చెప్పిన హెచ్‌‌‌‌ఎండీఏ అధికారులు.. చివరి వరకూ డ్రా తీసే ప్లేస్‌‌‌‌ను రహస్యంగా ఉంచారు. మొదటగా సరూర్‌‌‌‌‌‌‌‌నగర్ ఇండోర్ స్టేడియంలో డ్రా నిర్వహిస్తారనుకున్నా.. చివరి నిమిషంలో జూబ్లీహిల్స్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఏర్పాటు చేశారు. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున ఇండ్లను ఎలా కేటాయిస్తారో తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు హౌసింగ్ బోర్డు, హెచ్ఎండీఏ ఆఫీసుల చుట్టూ తిరిగారు. డ్రా నిర్వహణపై చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు.