విమానంపై రజనీ… దర్బార్ పోస్టర్

విమానంపై రజనీ… దర్బార్ పోస్టర్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా..దర్బార్ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే స్పీడందుకున్నాయి. ఇందులో  భాగంగా రోజుకో కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది చిత్ర యూనిట్.

అంతేకాదు సినిమా ప్రచారాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. గతంలో రజనీకాంత్ సినిమా….కబాలి కి చేసినట్టుగా విమానాలపై దర్బార్ పోస్టర్లు అతికించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది చూసిన వారు రజనీ సినిమానా… మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారట.