Rajinikanth : 'కూలీ'కి ఏ సర్టిఫికెట్.. రజనీ కెరీర్ లో తొలిసారిగా..

Rajinikanth : 'కూలీ'కి ఏ సర్టిఫికెట్..  రజనీ కెరీర్ లో తొలిసారిగా..

సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) కు ఉన్న క్లాస్, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన బొమ్మ థియేటర్లలో పండిందంటే చాలు జనం క్యూ కట్టాల్సిందే.  ఈలలతో దద్దరిల్లాల్సిందే. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీగానే మోత మోగించేందుకు సిద్ధమైయ్యారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కూలీ' ( Coolie ) చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. యాక్షన్, డ్రామా, వినోదం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రజనీకాంత్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కూలీ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కానీ ఈ సినిమా ఏ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఇన్నేళ్ల రజనీ సినీ కెరీర్ లో ఏ సర్టీఫికేట్ పొందిన  తొలి చిత్రంగా 'కూలీ నిలవనుంది. ఈ సినిమాలో హింస, యాక్షన్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ సినిమాను చూడాలంటే పెద్దలకు మాత్రమే థియేటర్లలో అనుమతి ఉంటుంది.  అంటే ఈ ఏ  సర్టిఫికేట్ ఉన్న సినిమాలు 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే చూడడానికి అనుమతి ఉంటుంది.

ALSO READ : Anasuya: ఒక్కొక్కడికీ "చెప్పు తెగుద్ది".. పబ్లిక్ మీటింగ్ లో వార్నింగ్ ఇచ్చిన అనసూయ

ఈ'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా,   సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో పూజాహేగ్డే ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.  అమీర్ ఖాన్ దహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  దాదాపు 38 ఏళ్ల తర్వాత సత్యరాజ్, 29 ఏళ్ల తర్వాత ఆమీర్ ఖాన్ రజినీకాంత్ తో జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. 

ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద యుద్ధమే జరగనుంది. ఇదే రోజు జూనియర్ ఎన్టీఆర్ (  Jr NTR ), హృతిక్ రోషన్ (  Hrithik Roshan )  కలిసి నటించిన 'వార్ 2' (  War 2 ) రిలీజ్ కానుంది.  ప్రపంచ వ్యాప్తంగా 'కూలీ', 'వార్ 2' ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  భారీ బడ్జెట్స్ తో  తెరకెక్కిన ఈ రెండు చిత్రాలపై అంచనాలు తారాస్థాయి చేశారు. మరి బాక్సాఫీస్ వద్ద విజేతలు ఎవరో చూడాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే.