
యాదాద్రి, వెలుగు : రాజీవ్ యువ వికాసం (ఆర్ వైవీ) పథకం లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోందని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. అర్హులైనవారికి జూన్2 నుంచి యూనిట్ మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో స్కీమ్ గురించి ఆఫీసర్లు వివరించారు.
వెల్ఫేర్డిపార్ట్మెంట్లవారీగా ఆర్‌వైవీ కోసం 39 వేల అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు యూనిట్ వారీగా వచ్చిన అప్లికేషన్ల సంఖ్యను వివరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికే ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రారంభించిందని తెలిపారు.
స్పీడ్‌గా సీఎంఆర్ అందించాలి..
సీఎంఆర్ స్పీడ్‌గా అందించాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వడ్ల దిగుమతి చేసుకున్న స్థాయిలో సీఎంఆర్ అందించాలని సూచించారు.