రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం : అజీజ్ పాషా

 రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం : అజీజ్ పాషా

హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనున్నట్లు టీపీసీసీ జాయింట్ సెక్రటరీ అజీజ్ పాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున్ రావు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ ఇందిరా భవన్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ తో సంబంధం లేదన్నారు. 

గతంలో లోన్లు తీసుకున్న వారికి కాకుండా కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 28 వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందన్నారు. జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు లెటర్లను అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సమ్మెట సుబ్బరాజు, యడవెల్లి వీరబాబు, పాశం రామరాజు, చెన్నం శ్రీనివాస్, సైదులు తదితరులు పాల్గొన్నారు.