పాక్ లోని ప్రతీ అంగుళమూ బ్రహ్మోస్ పరిధిలోనే..కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌నాథ్సింగ్

పాక్ లోని ప్రతీ అంగుళమూ బ్రహ్మోస్ పరిధిలోనే..కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌నాథ్సింగ్
  • బ్రహ్మోస్​ శక్తి ప్రదర్శన కాదు.. ఆత్మనిర్భర్​ భారత్ ​లక్ష్యంలో ముందడుగని వెల్లడి
  • యూపీ సీఎం యోగితో కలిసి సైన్యానికి బ్రహ్మోస్​ మిసైల్స్ ​అప్పగింత

లక్నో: పాకిస్తాన్​లోని ప్రతి అంగుళం మన బ్రహ్మోస్​ రేంజ్‌‌‌‌లోకి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్​పేర్కొన్నారు. ఇక మన శత్రుదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదని అన్నారు. ఆపరేషన్​ సిందూర్​ ఓ ట్రైలర్​ మాత్రమేనని, దీని ద్వారా మన సైన్యం పరాక్రమం చాటిందని చెప్పారు. శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌‌‌‌లో తయారైన మొదటి బ్యాచ్ మిసైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌తో కలిసి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్​ సైన్యానికి అప్పగించారు. 

అనంతరం ఆయన మాట్లాడారు. ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. కానీ ఆ ట్రైలర్ ద్వారా భారత్ తలచుకుంటే తమ దేశాన్ని ఏమైనా చేయగలదని పాకిస్తాన్‌‌‌‌కు తెలిసిపోయింది” అని పేర్కొన్నారు. ఆపరేషన్​ సిందూర్​ విక్టరీ మనకు ఓ చిన్న విషయం కాదని.. మన సైన్యానికి విజయాలు అలవాటుగా మారాయని రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ ప్రశంసించారు. ఇక్కడి బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే 2 దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పారు. 

కాగా, బ్రహ్మోస్​ మిసైల్​ తయారీ భారత స్వయం స్వావలంబనకు పునాది అని యోగి ఆదిత్యనాథ్​ పేర్కొన్నారు. ఈ యూనిట్ల కోసం 2,500 ఎకరాల భూమిని అందుబాటులో ఉంచామని తెలిపారు.

యూపీలో పారిశ్రామిక విప్లవం: రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్​

యూపీలో ఇంత పారిశ్రామిక విప్లవం జరుగుతుందని పదేండ్ల క్రితం ఎవరూ ఊహించలేదని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్​ పేర్కొన్నారు. లక్నోలోని పీటీసీ ఇండస్ట్రీస్‌‌‌‌కు చెందిన టైటానియం, సూపర్ ​అల్లాయ్​మెటీరియల్ ​ప్లాంట్ ​ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. యూపీ గడ్డపై ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగడం చాలా గొప్ప విషయం అని అన్నారు.