రాజు పటేల్ ..ది డిజిటల్ బెగ్గర్

రాజు పటేల్ ..ది డిజిటల్ బెగ్గర్

బీహార్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం... ఇవీ.. ఇప్పుడు మనకు తరచుగా వినబడే మాటలు. ఈ యాప్స్ ద్వారా ఎవరికైనా...ఎప్పుడైనా..ఎక్కడ నుంచైనా .. క్షణాల్లో డబ్బు పంపొచ్చు. మనీ ట్రాన్సాక్షన్ కోసం ఈ యాప్ల వినియోగం ఇప్పుడు బాగా పెరిగింది. ఇక ఈ ఆన్ లైన్ పేమెంట్ వినియోగంలో తాను కూడా ఎవరికి తక్కువ కాదంటూ నిరూపిస్తున్నాడు రాజు పటేల్ అనే బెగ్గర్. భిక్షాటన కోసం ఫోన్ పే, గూగుల్ పేలను వాడుతూ .. ‘డిజిల్ బెగ్గర్’ గా వార్తల్లో నిలిచాడు. బీహార్కు చెందిన రాజు పటేల్ కొన్నేళ్లుగా బెట్టియా రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. స్టేషన్ కు వచ్చి .. పోయే ప్రయాణికులను రాజు డబ్బు కోసం అర్ధిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి భిక్షాటన చేస్తున్నానని చెబుతున్న రాజు...ఆన్ లైన్ పేమెంట్ల వల్ల .. చాలా మంది ప్రయాణికులు చిల్లర లేదంటూ వెళ్లిపోయేవారని వాపోయాడు. కొంత మంది ‘ఫోన్ పే ఉందా...?  గూగుల్ పే ఉందా..? ’ అని అడిగేవారని చెప్పాడు. ఈ ఆన్ లైన్ పేమెంట్ల వల్ల ఒకానొక సందర్భంలో పూట గడవడం కూడా కష్టంగా మారిందన్నాడు. దీంతో తనకు కూడా ఫోన్ పే, గూగుల్ పే ఉండాలని భావించాడు రాజు. వెంటనే బెట్టియాలోని ఎస్బీఐకి వెళ్లి ..బ్యాంక్ అకౌంట్ కావాలన్నాడు. బ్యాంక్ అధికారులేమో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేకుంటే కుదరదన్నారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సంపాదించాడు రాజు. తర్వాత  బ్యాంక్ కు వెళ్లి తన పేరుమీద అకౌంట్ ఓపెన్ చేశాడు. వెంటనే ఆ అకౌంట్ ను ఫోన్ పే, గూగుల్ పేకు లింక్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి క్యూ ఆర్ కోడ్ స్కాన్నర్ ను మెడలో వేసుకొని .. ‘అయ్యా..స్కాన్ చేయండి’ అంటూ డిజిటల్ బెగ్గర్ గా మారాడు రాజు పటేల్. అంతే కాకుండా తన వద్ద ట్యాబ్ కూడా ఉందని చెబుతున్నాడు. పీఎం మోడీ చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం తనకు స్ఫూర్తినిచ్చిందని, మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుంటా వింటానని అంటున్న రాజు.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ కి  వీరాభిమానినని చెబుతున్నాడు. 

మరిన్ని వార్తల కోసం:

డేరా బాబాకు పెరోల్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ