సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు రోజుకో మాట మాట్లడుతున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టని తెలంగాన నేతలంటున్నారని..అలాంటపుడు సాగునీరు, తాగునీరుకు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. 2015లో జరిగిన ఒప్పందంలో కేసీఆర్ ఆమోదంతో రెండు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారన్నారు. ఈ అగ్రిమెంట్ కాదంటే తాము కూడా రాష్ట్ర విభజనకు ఒప్పుకోమన్నారు. తిరిగి మళ్లీ సమైక్య రాష్ట్రం కావాలని కోరుతామన్నారు. కర్నాటక నీళ్లు తీసుకెళ్తే మాట్లాడని కేసీఆర్.. ఇక్కడి నీటిని మాత్రం తోడుకుంటున్నారన్నారు. కేసీఆర్ కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే నీళ్ల వివాదాలను తెరపైకి తెస్తున్నారన్నారు. తెలంగాణలో ఏపీ ఓట్లు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించారు. రెండు, మూడు రోజుల్లో రాయలసీమ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
