బైడెన్‌.. మా కష్టాలపై మోడీతో మాట్లాడండి

బైడెన్‌.. మా కష్టాలపై మోడీతో మాట్లాడండి

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షి చర్చల సందర్భంగా తమ కష్టాల గురించి చర్చించాలని అగ్ర రాజ్యాధినేతను రైతు ఉద్యమ నేత రాకేశ్‌ తికాయత్ కోరారు. అగ్రి చట్టాల రద్దు చేసేలా ఒప్పించి తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రెసిడెంట్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. 

‘‘డియర్ అమెరికా ప్రెసిడెంట్.. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతులం దాదాపు 11 నెలలుగా ఆందోళనలు చేస్తున్నాం. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మమ్మల్ని కాపాడేందుకు ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా మా కష్టాలపై ఫోకస్ చేయండి” అంటూ రాకేశ్ తికాయత్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. #Biden_SpeakUp4Farmers అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ చేశారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆ దేశంలో ఉన్న భారతీయులు అక్కడ నిరసనలు చేయాలని రాకేశ్ తికాయత్‌ కోరారు. రేపు (శనివారం) మోడీ ప్రాగ్రామ్స్ జరిగే ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా అమెరికాలో ఉన్న భారతీయులు ఆందోళనలు చేయాలని ఓ వీడియో సందేశంలో ఆయన రిక్వెస్ట్ చేశారు. అలాగే అమెరికాలోని ఇండియన్స్ అంతా వాళ్ల వెహికల్స్‌కు రైతుల జెండాను పెట్టుకోవాలని, ‘‘నో ఫార్మర్.. నో ఫుడ్” అన్న బ్యానర్లు పెట్టుకుని రైతులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఎండ, వాన, చలి అన్న తేడా లేకుండా దాదాపు 11 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరిపేందుకు సిద్ధపడకపోవడం బాధాకరమని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

కారు రైడింగ్ ఇరగదీసిన 90 ఏండ్ల బామ్మ

గడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు

రేవంత్ చెంచాగాళ్ల ట్రోల్స్ ఎక్కువైనయ్.. ఫిర్యాదు చేస్త

కమలా హ్యారిస్‌కు ప్రధాని మోడీ కానుకలు