కమలా హ్యారిస్‌కు ప్రధాని మోడీ కానుకలు

కమలా హ్యారిస్‌కు ప్రధాని మోడీ కానుకలు

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కు ప్రత్యేకమైన కానుకలు ఇచ్చి.. ఆమెను సర్‌‌ప్రైజ్‌ చేశారు. భారత మూలాలున్న కమలా హ్యారిస్‌కు ఆమె తాతయ్య పీవీ గోపాలన్‌కు సంబంధించిన గుర్తులను అందజేశారు. భారత ప్రభుత్వంలో సెంట్రల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌‌గా గోపాలన్‌ సేవలు అందించి, రిటైర్‌‌ అయ్యారు. పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కార్యదర్శి స్థాయిలో  పని చేస్తూ 1956, 1966 సంవత్సరాల్లో బదిలీ, పదోన్నతులు పొందిన సందర్భాల్లో ఇచ్చిన నోటిఫికేషన్లను చెక్కపై చెక్కించి, వాటిని కమలా హ్యారిస్‌కు బహూకరించారు. అలాగే కాశీలో ప్రసిద్ధి చెందిన గులాబీ మీనకరి ఆర్ట్‌తో చెక్కిన చెక్‌ సెట్‌ను కూడా ఆమెకు అందజేశారు. కమలా హ్యారిస్‌ అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలోకి వచ్చాక మోడీ తొలిసారి ఆ దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ కానుకలతో అందించడం విశేషం.

ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులకు కూడా..

అమెరికా పర్యటనలో భాగంగా క్వాడ్ దేశాధినేతలతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇందులో సభ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులకు కూడా బహుమతులు ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌కు గులాబీ మీనకరి ఆర్ట్‌ వర్క్‌ చేసిన నౌక బొమ్మను అందజేశారు. జపాన్ ప్రధాని యొషిహిడే సుగాకు గంధపు చెక్కతో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని మోడీ గిఫ్ట్‌గా ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

సీఎం కేసీఆర్ దగ్గరికి మంత్రి మల్లారెడ్డి పంచాయితీ

ఆర్టీసీ బస్సులో ఆంధ్రా టూ హైదరాబాద్ గంజాయి స్మగ్లింగ్

కోర్టులో లిక్కర్ సీన్‌: కపిల్‌ శర్మ షోపై కేసు