అక్కపై కాసుల ప్రేమ చూపించాడు

అక్కపై కాసుల ప్రేమ చూపించాడు

రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కకు అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు ఓ తమ్ముడు. 14 ఏళ్లపాటు దాచిన డబ్బులతో అక్కకు తులాభారం వేశాడు. ఖమ్మంలోని కాకతీయ ఆర్చి సెంటర్ లో ఉంటున్న బసవ నారాయణకు ఇద్దరు పిల్లలు. కూతురు అనుశ్రీ పుట్టిన 12 యేళ్ల తర్వాత..కొడుకు త్రివేది పుట్టాడు. చిన్నతనం నుంచి అక్కా తమ్ముళ్ల మధ్య బాగా ఎటాచ్మెంట్ ఏర్పడింది.  

అక్కంటే  త్రివేదికి అమితమైన ప్రేమ. పెళ్లై హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న అక్కకు త్రివేది సర్పైజ్ గిఫ్ట్ ఇవ్వలనుకున్నాడు. 14 ఏళ్లపాటు 12వేల 5 రూపాయల కాయిన్స్ ను సమకూర్చాడు.  రాఖీ పౌర్ణమిని ముహుర్తంగా పెట్టుకుని అక్క అనుశ్రీని పిలిపించి తులాభారం వేశాడు. ఈ రాఖీ పౌర్ణమిని తన అక్క చిరకాలం గుర్తు పెట్టుకునేలా చేశాడు.