
రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న డైరెక్టర్ రమేశ్ వర్మ(Ramesh Varma). ఒక ఊరిలో మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా రమేష్ వర్మ గత చిత్ర ఖిలాడీ మూవీ బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఏడాదికి పైగా నెక్స్ట్ ప్రాజెక్టును ప్రకటించలేదు.
లేటెస్ట్ గా డైరెక్టర్ రమేష్ వర్మ నుంచి శివోహం అంటూ అద్భుతమైన విజువల్..మిస్టరీ థ్రిల్లర్ కథతో ముందుకు వస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 22న) రమేష్ వర్మ బర్త్ డే స్పెషల్ గా శివోహం( Shivoham) మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
శివోహం మూవీని విజువల్ గ్రాండ్ గా తెరకెక్కించడానికి..స్టూడియో గ్రీన్ సంస్థ బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయట్లేదని సమాచారం. స్టూడియో గ్రీన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..శివోహం మిస్టీరియస్ సాగే కథని ..రహస్య నిధి కోసం..ఒక దుర్మార్గపు డెవిల్స్ యుద్ధం..అంటూ చెపుతూ..త్వరలో విజువల్ గ్రాండ్ తో పాటు..టెక్నికల్ టీం ను ప్రకటిస్తాం అంటూ పేర్కోన్నారు.
రాక్షసుడు వంటి బ్లాక్ బాస్టర్ మూవీని తీసిన రమేష్ వర్మ ఈ మూవీ కోసం అద్భుత స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ స్టోరీ, డైలాగ్స్, శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు.
ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన రాక్షసుడు మూవీ బెల్లకొండ సాయి శ్రీనివాస్ కు, అనుపమ పరమేశ్వరన్ కు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత రవితేజ తో ఖిలాడీ మూవీతో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు డైరెక్టర్ రమేష్ వర్మ. ఇక ఈ మూవీని స్టూడియో గ్రీన్ బ్యానర్పై కె ఇ జ్ఞానవేల్ రాజా సమర్పిస్తున్నారు.
On the occasion of our @DirRameshVarma’s Birthday, We Proudly announce our next.
— Studio Green (@StudioGreen2) August 22, 2023
Unlocking a Mysterious Saga.. A VICIOUS DEVIL's battle for a SECRET TREASURE.. #Sivoham ?
Get Ready To Witness A Spectacular Visual Extravaganza with Magnificent Cast & Crew?
@kegvraja… pic.twitter.com/pawqbXS1QY