స్పీడ్ పెంచిన రకుల్ ప్రీత్ సింగ్

స్పీడ్ పెంచిన రకుల్ ప్రీత్ సింగ్

సౌత్‌‌‌‌లో ఎప్పుడైనా ఒక సినిమాలో కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌‌‌‌లో మాత్రం స్పీడు బాగా పెంచింది. డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ, మిషన్ సిండ్రెల్లా, ద లేడీ కిల్లర్ చిత్రాలతో పాటు అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌తో ఒక సినిమా చేస్తోంది. వీటిలో నాలుగు సినిమాలు ఆల్రెడీ పూర్తయ్యాయి. రిలీజ్‌‌‌‌కి రెడీ అవుతున్నాయి. ఇవి కాక ఆ మధ్య ‘మేరే పత్నీకా రీమేక్’ అనే మూవీకి కూడా కమిటయ్యింది రకుల్. ‘ద లేడీ కిల్లర్‌‌‌‌‌‌‌‌’లో ఆమెతో కలిసి నటిస్తున్న అర్జున్ కపూరే ఈ చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. విశేషమేమిటంటే ఆ మూవీలో వీరిద్దరితో కలిసి నటిస్తున్న భూమి పెడ్నేకర్ ఈ మూవీలో కూడా యాక్ట్ చేస్తోందట. ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ తీసిన ముదసిర్ అజీజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఇదో కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. తన భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఒకబ్బాయి మరో అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ తర్వాత ఆ అమ్మాయి కూడా అదే టైప్ అని తెలుస్తుంది. అప్పుడతను పడే కష్టాల చుట్టూ కథ తిరుగుతుందని, మంచి ఫన్ ఉంటుందని అంటున్నారు. ఈ మూవీ జులైలో మొదలవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యమవుతుందని చెబుతున్నారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో మూవీ సెట్స్‌‌‌‌కి వెళ్తుందట. ఇంత బిజీగా ఉండి కూడా సోషల్‌‌‌‌ మీడియాలో యాక్టివ్‌‌‌‌గా ఉంటోంది రకుల్. ఆమధ్య ఓ డ్యాన్స్ వీడియో పెట్టి ట్విటర్‌‌‌‌‌‌‌‌ని షేక్ చేసింది. ఇప్పుడు కపిల్‌‌‌‌ దేవ్, సద్గురులతో గోల్ఫ్ ఆడుతున్న వీడియోని షేర్ చేసింది. ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది.