తండ్రైన తరువాత మొదటిసారి షూట్లో రామ్ చరణ్.. సంబరాలు చేసిన టీమ్

తండ్రైన తరువాత మొదటిసారి షూట్లో రామ్ చరణ్.. సంబరాలు చేసిన టీమ్

మెగా ప్రిన్సెస్(Mega princes) కొణిదెల ఇంట్లో అడుగుపెట్టిన తరువాత ఫస్ట్ టైం షూట్ లో అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan). ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil rakju) నిర్మిస్తున్నారు. 
 
రామ్ చరణ్ సతీమణి ఉపాసన(Upasana) డెలివరీ కోసం దాదాపు 40 రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు రామ్ చరణ్. దాదాపు రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత జులై 12న సెట్ లో అడుగుపెట్టారు రామ్ చరణ్. దీంతో మూవీ టీమ్ సెట్ లో సంబరాలు జరిపారట. దీనికి సంబందించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSOREAD :కాకా అనే టైటిల్‌తో పూరీ, బాలయ్య మూవీ?

ఇక ఈ కొత్త షెడ్యుల్ ను యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేశారట దర్శకుడు శంకర్. సినిమాలో చాలా కీలక సమయంలో రానున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం అద్భుతమైన స్టెంట్స్ కంపోజ్ చేశారట ఫైట్ మాస్టర్ అన్బు అరువు. పిలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiyara adwani) హీరోయిన్ గా నటిస్తుండగా.. SJ సూర్య(SJ surya), శ్రీకాంత్(Srikanth), అంజలి(Anjali), సునీల్(Sunil),నవీన్ చంద్ర(Naveen chandra) కీలపాత్రల్లో కనిపించనున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తన్న ఈ సినిమా.. 2024 సంక్రాంతికి గానీ, సమ్మర్ కి గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.