Game Changer: రామ్‍చరణ్ కొత్త లుక్ లీక్..గేమ్ ఛేంజర్‌కు లీకుల బెడద తప్పదా!

Game Changer: రామ్‍చరణ్ కొత్త లుక్ లీక్..గేమ్ ఛేంజర్‌కు లీకుల బెడద తప్పదా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

అంతేకాదు.. ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.ఇవన్నీ చూస్తుంటే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యేవరకు లీకుల బెడద తప్పేటట్లు లేదు 

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్టణంలో జరుగుతోంది. అయితే, ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంభందించిన స్టిల్స్ లీకు అయ్యాయి.వైజాగ్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎపిసోడ్ నుంచి రామ్‍చరణ్ ఫొటోలు కొన్నిలీక్ అయ్యాయి. వీటి ద్వారా ఈ చిత్రంలో రామ్‍చరణ్ కొత్త లుక్ లో కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ పూర్తిగా క్లీన్ షేవ్, మీసంతో సరికొత్త లుక్‍ లో అదిరిపోయారు.ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్ సందర్భంగా చెర్రీ ఈ లుక్‍లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ ఫొటోస్ ని తమ ఫోన్ లలో డీపీ గా పెడుతూ కొందరు..షేర్ చేస్తూ మరికొందరు సంబురపడుతున్నారు.

పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, ప్రతీకారం, నమ్మకద్రోహం వంటి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయట. క్లైమాక్స్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని, శంకర్ గత చిత్రాలు ఒకే ఒక్కడు,భారతీయుడు, అపరిచితుడు వంటి సినిమాల రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందని టాక్. మరి రిలీజ్ తరువాత గేమ్ ఛేంజర్ సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంటుందో చూడాలి.

ఇక సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.